మనం మన కొడుకులు ,కూతుళ్లకు చాలా డబ్బు ,బంగారం,ఇళ్లు, పొలాలు ఇవ్వాలని ఆరాట పడుతూఉంటాం .ఈ పట్టీకి మంచి పర్యావరణం కూడా చేర్చితే చాలా మంచిది . పీల్చడానికి మంచి గాలి లేనప్పుడు ఎన్ని సౌఖ్యా లుండి లాభం ఏమిటి?
ఏదైనా కొనే ముందు, దాని వల్లమనకి వచ్చే సుఖం దానికి పెట్టే ఖర్చు ,ఆ వస్తువును ఎన్నాళ్ళు ఉపయోగించగలం ఇలాంటి వాటిని పరిగణలోకి తీసుకుంటాం దీనితో పాటు పర్యావరణానికి ఎలా మేలు చెయ్యాగలం అని ఆలోచిస్తే మంచిది . ఈరోజుల్లో మనకి ఉన్న పరిధిలో ,జీవన సరళీలో “Totally Environmental Friendly” గా ఉండడం కొంచెం కష్టం .కాని పర్యావరణానికి ఎంతోకొంత మేలు చేసేలా మనం ప్రవర్తిస్తే మన భావి తరాలకు మంచి చేసిన వాళ్ళ మౌతాం.
నా చిన్నప్పుడు tiffin తెచ్చుకోవాలంటే ఒక సంచి ,బాక్స్ పట్టుకొని వెళ్ళే వాడిని ,ఆ రోజుల్లో కొంత ఇబ్బంది గా ఉన్నా ఇప్పుడు ఆలోచిస్తే అదే మంచిది అనిపిస్తోంది . మరి ఇప్పుడు Plastic Cover వద్దు అని అమ్మే వాడితో గొడవ పెట్టుకోవలసిన పరిస్థితి .
మరిన్ని విశేషాలు తర్వాత...............
Saturday, October 24, 2009
Sunday, October 11, 2009
ఆధ్యాత్మికం
శ్రీ రామాయణం ఒక దేవుడి కథ గా, కథాశం మాత్రమే నాకు తెలుసు . శ్రీ రాముడు ఒక మానవుడి లాగా ఎలా ప్రవర్తించాడో ,ఒక సాధారణ మానవునిలో ఉండే కోపం,ఉత్సాహాన్ని కోల్పోవడం లాంటి బలహీనతల్ని ఎలా ఆధికమించాడో ఈ ప్రవచన కర్త చాలా చక్కగ వివరించారు. రామాయణాన్ని ఒక మానవ జీవిత కథ లా వింటే మనం ఏమి నేర్చుకోవచ్చో శ్రీ కోటీశ్వర రావు గారు చాలా చక్కగ వివరించారు.ఈ మధ్య కాలం లో నన్ను చాలా ప్రభావితం చేసిన ఆడియో ఇది.నా ఉద్దేశ్యంలో ఒక మనషి నడవడిక ని మార్చే శక్తి గల గ్రంథ౦ శ్రీ రామాయణం . నా లో వచ్చిన ఈ మార్పు ఎటువంటి వైక్లబ్యము పొందకుండు గాక.
http://srichaganti.net/
http://srichaganti.net/
స్ఫూర్తి...
కాళ్ళు తడవకుండా సముద్రం దాటవచ్చు కాని కళ్ళు తడవకుండా సంసార సాగరం దాటలేం అన్నది సామెత .
జీవితం లో ఎన్నో ఎత్తు పల్లాలు , సంఘర్షణలు .... కళ్ళు తడిసినా గమ్యాన్ని చూడగలిగేల నాకు స్ఫూర్తినిచ్చిన కొన్ని మాటలు
జీవితం లో ఎన్నో ఎత్తు పల్లాలు , సంఘర్షణలు .... కళ్ళు తడిసినా గమ్యాన్ని చూడగలిగేల నాకు స్ఫూర్తినిచ్చిన కొన్ని మాటలు
గుండె గొంతుకలోన కొట్లాడుతాదీ .........
ఏదో భావం మనసులో కదలాడుతూ ఉంటుంది ,దాన్ని వ్యక్తీకరించలంటే మంచి పదాలు పడక ఇబ్బంది పడుతూ ఉంటాం ఆ సంఘర్షణ లోంచి వచ్చిన కొన్ని పిచ్చి వ్రాతలు…
ప్రతి మనషి జీవితానికి రెండు అంచులుంటాయి
మనసులో,ప్రవర్తనలో ద్వంద్వం తప్పనిసరి
మొదటి అంచులో నైతిక విలువలు,సమాజం పట్ల భయంతో గీసుకున్న లక్ష్మణ రేఖలు , మనస్సాక్షి ఉంటాయి.
రెండవ అంచులో కేవలం స్వార్ధం ,బతక నెర్చినతనం కాస్త బరితెగింపు ఉంటాయి
ఆందరు మొదటి అంచులో ఉన్నట్టు భావిస్తారు లేదా అలా కనబడాలని ప్రయత్నిస్తారు.
కాని అందువల్ల తమకి నష్టం కలిగేల కనిపిస్తేమాత్రం “తప్పనిసరి” ఆనే చిన్న ఆత్మవంచన తో వేగంగా రెండవ అంచుకి దూకేస్తారు.
Most of the times “Expectation” spoil the relationships , we behave in a certain way and expect the others react in specific way and feel bad if other did not do so … if we are able to maintain any relationship without any expectations then the relationship will never become a weakness and cause any pain.

--------------------------------------- *** -------------------------------------
Most of the times “Expectation” spoil the relationships , we behave in a certain way and expect the others react in specific way and feel bad if other did not do so … if we are able to maintain any relationship without any expectations then the relationship will never become a weakness and cause any pain.
Subscribe to:
Comments (Atom)